Breaking News

అరకు ఎంపీ స్వగ్రామంలో మహిళకు రక్షణ కరువు

0 19

 సాక్షాత్తు అరకు ఎంపీ స్వగ్రామంలో మహిళకు రక్షణ కరువు.

అధికార వైసీపీ పార్టీకి చెందిన అదే గ్రామానికి చెందిన సర్పంచ్ సత్యనారాయణ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మీడియా వారికి తెలిపిన రాజు అనే మహిళ.

తన కోరిక తీర్చాలని, లేదంటే తనకు వచ్చే పెన్షన్ ఆపేస్తానని, ఇల్లు పీకించేస్తానని, రేషన్ కార్డు తీయించేస్తానని బెదిరించాడని రాజు అనే మహిళ అంటుంది.

అయితే ఈ నెల ఏడవ తారీకున సోమవారం నాడు రాత్రి 12 గంటల సమయంలో, తన ఇంట్లో తాను ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో తన కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని రాజు అనే మహిళ మీడియాకు తెలిపింది.

ఆ సమయంలో చుట్టుపక్కల ఇళ్లలో వారిని పిలిచానని,రాత్రి సమయం కావడంతో ఎవరూ లేవలేదని తాను చెప్తుంది.

తనకు ఒక కూతురు ఉందని,తనకి పెళ్ళి చేసి పంపించేశానని, ఇక నాకు వెనక ముందు ఎవరు లేరని ఒంటరిగా ఉంటున్నానని, ఒంటరిగా ఉంటున్న తనతో ఈవిధంగా ప్రవర్తించడం సరికాదని అంటుంది.

మరోసారి సర్పంచ్ తనతో అసభ్యంగా ప్రవర్తించకుండా తనకు న్యాయం చేయాలని గ్రామ పెద్దలకు తెలియజేసినప్పటికీ, సుమారుగా పది రోజులు అవుతున్నా తనకు ఎవరూ న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే ఈ విషయమై శరభన్నపాలెం సర్పంచ్ సత్యనారాయణను వివరణ అడుగగా తాను ఆమె ఇంటి వద్దకు వెళ్లలేదని, ఆవులు ఆమె ఇంటి లోపలికి వస్తే రాయి విసిరానని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.