Breaking News

చేతబడి చేస్తున్నాడనే నెపంతో వ్యక్తి దారుణ హత్య.

0 24

 

చేతబడి చేస్తున్నాడనే నెపంతో వ్యక్తి దారుణ హత్య.

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం లోని మంప పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బూధరాళ్ళ పంచాయతీ పరిధిలోని చీడిపల్లి గ్రామానికి చెందిన బోనంగి సొమ్రన్న అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 22వ తేదీ నుండి సొమ్రన్న కనిపించడం లేదని ఆయన భార్య బోనంగి సన్యాసమ్మ ఈనెల 16వ తేదీన తమకు ఫిర్యాదు చేసినట్లు మంప ఎస్ఐ లోకేష్ కుమార్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన కుర్తాడి మల్లేశ్వరరావు, కృష్ణారావు లతో కలిసి చివరిసారిగా తన భర్త వెళ్ళినట్లు సన్యాసమ్మ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా భూవివాదాలు, చేతబడి చేస్తున్నారనే నెపంతో మల్లేశ్వరరావు, కృష్ణారావు లు మరో వ్యక్తి మల్లన్న తో కలిసి ఈనెల 12వ తేదీ శనివారం రాత్రి 9 గంటల సమయంలో సొమ్రన్న ను హత్యచేసి గోతిలో పాతిపెట్టినట్టు తేలిందన్నారు. ఈ మేరకు గురువారం కొయ్యూరు సీఐ ఎ.స్వామి నాయుడు,మంప ఎస్ఐ లోకేష్ కుమార్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మండల తాహశీల్దార్ తిరుమల రావు సమక్షంలో శవ పంచనామా జరిపించారు.ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ.ఎస్ఐ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.