Breaking News

గిరిజనుడి హత్య కేసును ఒక్క రోజులో ఛేదించిన పోలీసులు.

0 19
పట్టుబడిన నిందితులు


 
 గిరిజనుడి హత్య కేసును ఒక్క రోజులో ఛేదించిన పోలీసులు.

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చీడిపల్లిలో జరిగిన గిరిజనుడి  హత్య కేసులో భూ తగాదాలే ప్రధాన కారణం అని సీఐ స్వామినాయుడు తెలిపారు. నిందితులు మల్లేశ్వరరావు,కృష్ణారావు,మల్లన్న లు విచారణ లో తెలిపారు. అయితే మొదటగా బోనంగి సన్యాసమ్మ  తేదీ 16/03/2022 న ఫిర్యాదు మేరకు  ఈ కేసు మిస్సింగ్ కేసుగా నమోదు అయ్యింది.వెంటనే స్పందించిన కొయ్యూరు సీఐ స్వామి నాయుడు, మంప SI లోకేష్ కుమార్, మంప సిబ్బంది దేవుడు బాబు,శ్రీను లతో  హుటాహుటిన రంగంలోకి దిగి ఒక్క రోజులోనే కేసుని ఛేదించడం జరిగింది.

హత్యకి గురైన గిరిజనుడు సొమ్రన్న

నిందితులు అయిన మల్లేశ్వరరావు,కృష్ణారావు,మల్లన్న లు మృతుడు అయిన బోనంగి సొమ్రన్న ను  జీలుగు కళ్ళు తాగుదాం అని తీసుకువెళ్ళి, తేది 12/03/2022 నాడు రాత్రి 9 గంటల సమయంలో, నిందితుల భూములను బోనంగి సొమ్రన్న ఆక్రమించుకున్నడని  భూ వివాదం విషయంలో బోనంగి సొమ్రన్న ని చంపినట్లు నిందితులు తెలిపినట్లు కొయ్యూరు సీఐ స్వామి నాయుడు తెలిపినారు.ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగిందని సీఐ స్వామినాయుడు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.