Breaking News

టిడిపి పార్టీ నేతలపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు: టిడిపి మండల నాయకులు

0 20

 

విశాఖ జిల్లా: కొయ్యూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట దొరబాబు బైకు ఈనెల 4వ తేదీన శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసు విచారణలో ఉండగా అదే వారంలో మరో కార్యకర్త గడుతూరి రాంబాబు వేరొక కేసులో ఉండటం అది కూడా విచారణలో ఆయనకు పోలీసులు కొట్టడం టిడిపి పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలు సమయపాలన పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

అలాగే జేఏసీ అంటే వ్యక్తి కాదని, కొన్ని సంఘాల సమూహం అని, జేఏసీ పై టిడిపి పార్టీకి చాలా గౌరవం ఉందని, ఎవరో కొంతమంది స్వలాభం కోసం టిడిపి పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేసి వర్గ విభేదాలు సృష్టించడం తగదని, కొయ్యూరు మండలంలో టిడిపి పార్టీకి ఎటువంటి విభేదాలు లేవని, టిడిపి అనే ఒక వర్గం మాత్రమే ఉందని, దయచేసి టిడిపి నాయకులు పై ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని మాజీ ఎంపిటిసి శివరాజు, పార్లమెంటరీ తెలుగు యువత కార్యదర్శి & టిడిపి మండల ఇన్చార్జ్ కురుజు శ్రీనుబాబు,పాగి.రాజుబాబు,లోతా రమణ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.