Breaking News

గిరిజన ప్రాంత సర్కారీ బడిలో చురుకైన చదువుకై అరకు ఎంపీ ఆరాటం.

0 21

 గిరిజన ప్రాంత సర్కారీ బడిలో చురుకైన చదువుకై అరకు ఎంపీ ఆరాటం.

ఎంపీ ప్రత్యేక చొరవతో త్వరలో పైలెట్ ప్రాజెక్ట్ గా ఏజెన్సీలోని 14 పాఠశాలల విద్యార్థులకు,గ్రామీణ విద్య మరియు ONGC ఆర్థిక భాగస్వామ్యంతో డిజిటల్ క్లాస్ ప్రారంభం-అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి వెల్లడి.

స్వతహాగా గతంలో ఆశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పని చేసిన అనుభవం,తమ గిరిజన ప్రాంత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆరాటం,అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి ప్రత్యేక చొరవ తీసుకొని సంప్రదించిన వెంటనే గ్రామీణ విద్య మరియు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ముందుకు వచ్చి ఇరువురి భాగస్వామ్యంతో,ఏజెన్సీ 11 మండలాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న 14 పాఠశాలలు ముందుగా గుర్తించి పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ క్లాస్ రూమ్లు,అతి త్వరలో 5 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు,మరియు 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.

ఇప్పటికే జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు లో భాగంగా పాఠశాల భవనాలకు మరమ్మత్తులు,పెయింటింగ్స్, టాయిలెట్స్ రిపేర్,లోపల బయట ఫ్లోరింగ్,వంటగది మరమ్మత్తులు చేయించి అందంగా ముస్తాబయిన ఈ పాఠశాలలకు,అరకు ఎంపీ మాధవి చొరవతో కొత్తగా ఏర్పాటు చేయబోయే డిజిటల్ క్లాస్ రూమ్ మరింత వన్నెతేబోతున్నాయి.

అరకు ఎంపీ విద్యపైనే,కాకుండ పార్లమెంట్ అభివృద్ధిపై తనదైన శైలిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని,విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ,గతంలో ఈ అరకు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వారు ఎవరూ చేయలేని కార్యక్రమాలు చేస్తున్నందుకు పార్లమెంట్ ప్రజలు హర్షిస్తున్నారు.

ఒక ఉన్నత ఆలోచన కొన్ని వందల మంది విద్యార్థి, విద్యార్థునుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లయినది అని ప్రజలు కొనియాడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.