లింగంపేట గ్రామంలో మండల టిడిపి పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ పరవాడ అప్పలనాయుడు ఇంటి వద్ద గ్రామ టిడిపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజలందరికీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కార్యకర్తలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ సీనియర్ నాయకులు చిటికెల సాంబమూర్తి, గెడ్డం సత్యనారాయణ, చోద్యం సర్పంచ్ ఆదపురెడ్డి గోపాలకృష్ణ, లింగంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు మరిశా వెంకటరమణ, టిఎన్ఎస్ఎఫ్ అనకాపల్లి పార్లమెంటు పరిధి ఉపాధ్యక్షులు గోలకొండ శ్రీకాంత్, తెలుగు యువత కార్యదర్శి గొంతిన నర్సింగరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.