Breaking News

మల్లు స్వరాజ్యం సంతాప సభ.

0 32

 మల్లు స్వరాజ్యం సంతాప సభ.

 విశాఖ జిల్లా, వి.మాడుగుల మండలంలో సోమవారం మల్లు స్వరాజ్యం సంతాప సభ నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  జోహార్ మల్లు స్వరాజ్యం, జోహార్ మల్లు స్వరాజ్యం, రెడ్ సెల్యూట్ మల్లు స్వరాజ్యం అని నినాదాలు చేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం కార్లి భవాని గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట నరసింహమూర్తి వారు మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళా కమాండర్ గా పనిచేసి నాటి తెల్లదొరల దురహంకారానికి రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టి పోరాట స్ఫూర్తిని రగిల్చారని, భూస్వాముల కుటుంబంలో జన్మించిన సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి పీడిత వర్గాల తరపున దళిత బలహీన వర్గాల తరపున ధైర్యంగా నిలబడి పోరాడారన్నారు. బాంచన్ దొర అనే రోజుల్లో గోరి కడతా కొడకా అని నిజాం నవాబును స్వరాజ్యం ఎదిరించారని మహిళలతో తుపాకులు పట్టించి దళాలకు కమాండర్ గా వీరోచిత పోరాటాలు చేసి కమ్యూనిస్టు చరిత్ర చెరగని ముద్ర వేశారు. చివరి వరకు పార్టీ కోసం పని చేసిన వీరవనిత మల్లు స్వరాజ్యం మల్లు స్వరాజ్యం ఎత్తిన ఎర్రజెండాను కడదాకా మోయాలని అదే ఆమెకు ఇచ్చే నిజమైన ఘన నివాళి అని సిపిఎం పార్టీ లో మచ్చలేని మార్క్సిస్టు నాయకురాలుగా జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడ్డారని అన్నారు.సమాజంలోనే రుగ్మత లను తిప్పికొట్టేందుకు మరింతమంది వీరనారీమణులు మల్లు స్వరాజ్యంల పోరాటాల్లో కి రావాలని కోరారుు. ఈ కార్యక్రమంలో సన్యాసమ్మ్మ, అప్పారావు, దుర్గ నాయుడు, కృష్ణమ్మ తో పాటు మరో కొంత మంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.