Breaking News

చీడికాడ మండలంలో ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలి.

0 25

 చీడికాడ మండలంలో ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలి.


చీడికాడ మండలంలో ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని మంగళవారం గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట నరసింహమూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ కోనాం పంచాయతీలో జాజులపాలెం. మళ్లీపాడు,చెరుకుపల్లి, గొడుగుమామిడి, రెల్లలపాలెం,బంధ వీధి, కొత్తవీధి, కోనాం నుండి వాలాబు వరకు చీడికాడ పంచాయతీలో చీడికాడ కొండవీధి, వీరభద్ర పేట పంచాయతీలో ముడి చర్ల,అజయ్ పురం, కోండెంపూడి, గొప్పుఊరు గిరిజన గ్రామాలకు లింక్ రోడ్డు సౌకర్యం కల్పించాలని, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 వ ఏటకు వస్తున్నామని

కాని గిరిజన గ్రామాలకు నేటికీ రోడ్లు సౌకర్యాలు లేక ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయిన చిన్న పిల్లలు, ముసలి వారు గర్భిణీ స్త్రీలకు డోలిమొతలు మొసుకొని మెయిన్ రోడ్డు కు తీసుకొని రావలసి వస్తుందని, మా గిరిజన గ్రామాలు యెుక్క గిరిజనులు పరిస్థితి మరి అధ్వాన్నంగా ఉందన్నారు. గిరిజన గ్రామాలు అభివృద్ధి కావాలంటే ఆగ్రామాలకు రోడ్డు ఉంటేనే అభివృద్ధి అవుతుందని తెలిపారు. రహదార్లు లేని గ్రామాలు అంధకారంలో మగ్గిపోతాయని తెలిపారు. వెంటనే గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు సౌకర్యం కల్పించి వెంటనే గిరిజనులుకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.


Leave A Reply

Your email address will not be published.