Breaking News

కొయ్యూరు మండల నూతన ఏ టి డబ్ల్యూ ఓ బాధ్యతలు స్వీకారం.

0 21

 కొయ్యూరు మండల నూతన ఏ టి డబ్ల్యూ ఓ బాధ్యతలు స్వీకారం.


విశాఖ జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారిణిగా జి.మంగవేణి గురువారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు.

ఇక్కడ పనిచేసిన శ్రీనివాసరావు కు బదిలీ కావడంతో ఇప్పటి వరకు ఆ స్థానంలో ఇంచార్జ్ ఏ టి డబ్ల్యూ ఓ గా ఈశ్వరరావు కొనసాగారు.ఖాళీగా ఉన్న ఈ స్థానంలో రెగ్యులర్ ఏటిడబ్ల్యూవో మంగవేణి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ హాస్టల్ వెల్ఫేర్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.మల్లేష్ వార్డెన్లు తిరుపతి,రమేష్ తదితరులు ఆమెకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.