అమ్మా….భాగ్యమ్మ!ఉన్నావా?విన్నావా?:ఆదివాసీ జెెెెెఎసి.
విశాఖ జిల్లా: అమ్మా….భాగ్యమ్మా!ఉన్నావా?విన్నావా? అని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి నాయకులు ఎమ్మెల్యే పై తీవ్రంగా మండిపడ్డారు.వారు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మిని ఉద్దేశించి మాట్లాడుతూ నీ నియోజకవర్గం లోని భూభాగాన్ని ఇంకొకరు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే,నీ ఆదివాసీ ప్రజలు రక్షించండనీ మొరపెట్టుకొంటుంటే,రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తున్నట్లు ఉంది మీ వ్యవహారం.ఐదో షెడ్యుల్ ప్రాంతంలోని కొయ్యూరు మండలం బాలారం,కంఠారం,అడాకుల,ఆర్.కొత్తూరు గ్రామ పంచాయితీలను నాన్ షెడ్యూల్ మండలాలలైనా గొలుగొండ,నాతవరం మండలాలలో కలపాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమశంకర్ గణేష్ శాసనసభలో మాట్లాడితే పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా,సాటి ఆదివాసీగా ఆదివాసీల పక్షాన ఖండించకపోవడం దారుణం. శాసనసభలో మాట్లాడే అవకాశం వస్తే ఆదివాసీల సమస్యల మీద మాట్లాడుతారేమోనని చూస్తూ ఉంటాం,కానీ మీ అధినేతని పొగడడం కోసమే సమయమంతా వెచ్చిస్తున్నారు.పాడేరు నియోజకవర్గం మీద మీకన్నా నర్సీపట్నం ఎమ్మెల్యేకే ఎక్కువ మోజు ఉన్నట్లు ఉందని ఎద్దేవా చేస్తూ షెడ్యూల్ ప్రాంతాన్ని నాన్ షెడ్యూల్లో కలపడానికి ఇక్కడ ఆదివాసీలు ఎట్టి పరిస్థితులలో ఊరుకోరని చెప్పాలని పాడేరు ఎమ్మెల్యే ద్వారా నర్సీపట్నం ఎమ్మెల్యేకు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,జెఏసి కొయ్యూరు మండల కన్వీనర్ మాకాడ బూరుగులయ్య,జెఏసి జిల్లా మహిళ ప్రతినిధి శ్యామల వరలక్ష్మీ,జెఏసి నాయకులు సోమేష్ కుమార్,రీమెల పాలు,పరమేష్,గౌతం తదితరులు పాల్గొన్నారు.