యువతి అదృశ్యం.
విశాఖ జిల్లా , మధుసూదన్ నగర్,కైలాసపురం ప్రాంతానికి చెందిన గండిపిల్లి లావణ్య వయస్సు (17) ఈ నెల 22 రాత్రి 11 గంటల సమయం నుండి కనిపించటం లేదని,మరునాడు తెల్లవారు ఉదయం చూసే సరికి ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికిన ఆమె జాడ కనిపించక పోవడంతో యువతి తండ్రి గండిపిల్లి బాబ్జి స్థానిక కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేసారు.
సిఐ కృష్ణా రావు నేతృత్వంలో మహిళ ఎస్సై దివ్య భారతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.