రేపు 26న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కొయ్యూరు మండలం లో పర్యటన.
విశాఖ జిల్లా: మండలంలోని బాలారం,బకులూరు పంచాయతీలలో టిడిపి గౌరవ సభ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ జిసిసి చైర్మన్ ఎంవివి ప్రసాద్ హాజరు అవుతున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు గొలిసింగి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు, ఉపాధ్యక్షులు ఉల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. టిడిపి పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని అన్నారు.