Breaking News

కార్యకర్త కుమారుడికి నారా లోకేష్ గిఫ్ట్.

0 20

 తెలుగుదేశ‌మే తన ఇల్లు అని, కార్య‌క‌ర్త‌లే తన కుటుంబ‌స‌భ్యుల‌ని మ‌రోసారి చాటి చెప్పారు నారా లోకేష్‌. తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రావాలని చంద్రబాబు వీరాభిమాని… చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లికి చెందిన నాగ‌రాజు ఇప్ప‌టివ‌ర‌కూ 115 సార్లు తిరుమ‌ల కాలిన‌డ‌క‌న వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. 


నారా లోకేష్ ని కలిసేందుకు నాగరాజు తన కొడుకు మంజునాథని తీసుకుని వచ్చారు. మాటల్లో మంజునాథ పుట్టిన రోజు అని తెలియడంతో…వెంటనే కేక్ తెప్పించి కార్య‌క‌ర్త కుమారుడి పుట్టిన రోజు వేడుక‌ల్ని జరిపించారు లోకేష్. దీంతో తండ్రీ కొడుకులిద్ద‌రి ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. 


కేక్ కటింగ్ తర్వాత గిఫ్ట్ ఏమిచ్చారో తెలుసా? మంజునాథ వైద్య‌,విద్య‌కి అయ్యే ఖ‌ర్చు మొత్తం తానే భ‌రిస్తాన‌ని బ‌ర్త్‌డే బంప‌ర్ గిఫ్ట్ ఇచ్చారు లోకేష్‌. అంతేకాదు రూ.25 వేలు తక్షణ ఆర్థిక సాయంగా అందించారు.

Leave A Reply

Your email address will not be published.