మాజీ ఎంపిటిసి బాకురు గోపాల్ రాజు ను పరమర్శించిన దివంగత నేత అరకు మాజీ MLA సివేరి సోమ తనయుడు రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం.
విశాఖ జిల్లా హుకుంపేట మండలం అడ్డుమండ మాజీ ఎంపిటిసి సభ్యులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న సివేరి అబ్రహం పాడేరు లో నివాసం ఉంటున్న గోపాల్ రాజు ను పరామర్శించి ఆర్ధిక సహాయం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల యువత అధ్యక్షుడు కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.