Breaking News

కొడుకుని తల్లి దండ్రుల చెంతకు చేర్చిన మంప ఎస్ ఐ లోకేష్ కుమార్.

0 17

 

విశాఖ జిల్లా,కొయ్యూరు మండలం మటం భీమవరం పంచాయతీ, చిలకల పాలెం గ్రామానికి చెందిన కిముడు బద్రీనాథ్ (16) గత నాలుగు నెలల క్రితం తప్పి పోయాడని మంప పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు పిర్యాదు చేసినట్లు మంప ఎస్ఐ లోకేష్ కుమార్ తెలిపారు.పోలీసులు యువకుడి కోసం గాలించగా చిన్న అనే వ్యక్తి తో మహారాష్ట్ర చేరుకున్నాడని తెలవడంతో, అక్కడి వారికి సమాచారం ఇచ్చి యువకుడిని కొయ్యూరు రప్పించారు. తల్లిదండ్రులను పిలిపించి కొడుకు కిముడు బద్రీనాథ్ ని వారికి అప్పగించారు. తల్లిదండ్రులు మంప ఎస్ఐ లోకేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.