Breaking News

టిడిపి సీనియర్ నేత భౌతికకాయం వద్ద ఘన నివాళులు అర్పించిన టిడిపి మాజీ మంత్రి, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు.

0 15

 టీడీపీ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎంపిటిసి బాకురు గోపాల్ రాజు భౌతికకాయం వద్ద నివాళులు అర్పించిన మాజీమంత్రి కిడారి శ్రావణ్, రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం. అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం గడికించుమండ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి బాకురు గోపాల్ రాజు గత కొన్నిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం పాడేరులో తుదిశ్వాస విడిచారు…ఈరోజు స్వగ్రామమైన గడికించుమండ లో జరిగిన అంత్యక్రియలలో పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియాజేశారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ……… పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు శ్రావణ్, అబ్రహం భరోసా ఇచ్చారు….వారితోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్ర నాగరాజు,టీడీపీ మండల అధ్యక్షుడు కొర్ర తులసిరావు,మాజీ జెడ్పీటీసీ సుబ్బారావు,టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి సిరగం సూర్యకాంతం,సర్పంచ్లు పాండురంగస్వామి,బాకురు వేంకట్ రమణ రాజు,పాడి బాలన్న సత్యనారాయణ,మాజీ సర్పంచ్లు కామేశ్వరరావు, తదితరులు పాల్గొని నివాళులర్పించారుు.

Leave A Reply

Your email address will not be published.