Breaking News

ఎంపీ గొడ్డేటి మాధవి చొరవతో తమ స్వగ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు.

0 15

 అరకు ఎంపీ స్వగ్రామంలో ఎంపీ గొడ్డేటి మాధవి చొరవతో బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు.

ఈరోజు విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండలం, శరభన్నపాలెం గ్రామంలో నూతనంగా బిఎస్ఎన్ఎల్ త్రీ జి టవర్ ప్రారంభించిన గొట్టేటి మాధవి.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా మా ప్రాంతానికి కలగా మిగిలిన సెల్ సిగ్నల్ మా స్వగ్రామమైన శరభన్నపాలెం పంచాయితీ తో పాటుగా నడింపాలెం,వెలగలపాలెం,బట్టపనుకుల పంచాయితీ లకు బిఎస్ఎన్ఎల్ 3జి సేవలు ఎట్టకేలకు నా ఆధ్వర్యంలో అందుబాటులోకి రావడం గర్వంగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా తాను అడిగిన వెంటనే తమ గ్రామానికి టవర్ ఏర్పాటు చేసిన బిఎస్ఎన్ఎల్ డిఎం కి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం విశాఖ కు చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు, నిపుణుడు సూర్యప్రకాష్ చే, ఎంపీ దంపతుల ఆధ్వర్యంలో శుభకృత నామ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపి దంపతులు మాట్లాడుతూ…

అరకు పార్లమెంట్ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

ఈ శుభ కృత నామ సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ముందుగా కొయ్యూరు మండల మీడియా సోదరులకు, ప్రజాప్రతినిధులకు, వాలంటీర్లకు ఉగాది సందర్భంగా బహుమతులు, నూతన సంవత్సర క్యాలెండర్ లను అందజేశారు.

అనంతరం జ్యోతిష్య పండితుడు సూర్యప్రకాష్ కి ఎంపీ దంపతులు దుశ్శాలువతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్, కొయ్యూరు మండల జెడ్ పి టి సి వారా నూకరాజు, ఎంపీటీసీలు లోకుల సోమాగాంధీ,బిడిజన అప్పారావు, సర్పంచ్ కిముడు సత్యనారాయణ, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లు నర్సి కిరణ్, ముదిలి త్రినాథ్, బడ్డు సందీప్, పాలి నాయుడు, యువ నాయకుడు గొడ్డేటి మహేష్, పొట్టిక పోతురాజు,సత్తిబాబు, రామ్మూర్తి, సూరిబాబు, సురేష్ పట్నాయక్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.