Breaking News

పాడేరు కేంద్రం గా”అల్లూరి సీతారామరాజు జిల్లా” గా నూతన జిల్లా ప్రారంభం.సహచర ప్రజాప్రతినిధులతో జిల్లా అధికారులను స్వాగతం పలికిన అరకు ఎంపీ.

0 16

 నేటి నుండి పాడేరు కేంద్రం గా అల్లూరి సీతారామరాజు జిల్లా గా నూతన జిల్లా ప్రారంభం.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 కొత్త జిల్లాలను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా నూతనంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు నియమితులైన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను సహచర జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఘన స్వాగతం పలికిన అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి.

అనంతరం పాడేరు యూత్ శిక్షణ కేంద్రంలో జరిగిన నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చరిత్రాత్మక నిర్ణయం అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి గిరిజనుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నారని కొనియాడారు.

_ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో గోపాల కృష్ణ రోణంకి,సబ్ కలెక్టర్ అభిషేక్,పాడేరు,అరకు ఎమ్మెల్యేలు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి,చెట్టి ఫాల్గుణ,రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లి బాబు,రాష్ట్ర జిసిసి చైర్మన్ శ్రీమతి శోభ స్వాతి రాణి,ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ తమర్భ నర్సింగరావు,ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.