కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు.
చీడికాడ మండలంలో చీడికాడ మీ సేవ సెంటర్ వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మాట్లాడుతూ దూరప్రాంతాల నుంచి వచ్చి ఆధార్ లింక్ ఆధార్ కార్డులు తీసుకోవడానికి ఉదయం వచ్చి కరెంటు లేకపోవడంతో ఆకలితో మీ సేవ సెంటర్ వద్ద చిన్న పిల్లలతో ముసలి వారితో ఆకలితో కరెంటు వచ్చేవరకు వేచి చూస్తున్నా ప్రజలు రాష్ట్రం లో కరెంటు కోతలు లేవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల ద్వారా తెలియపరుస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాలలో కరెంటు కోతలు 3 లేక 4 గంటలు కరెంటు కోతలు పెట్టడం వలన పగలు రాత్రి పూట కూడా కరెంటు లేకపోవడంతో ప్రజలు ఎమ్మార్వో ఆఫీస్ ఎం.డి.ఓ ఆఫీస్ మీసేవ సెంటర్ల వద్ద రిజిస్ట్రేషన్ సెంటర్ల వద్ద వివిధ రకాల పనులకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చిన్న పిల్లలతో రాత్రిపూట తల్లులు చంటి పిల్లలకు ఈశుని కర్రతో గాలి విసురుతూ నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతున్నారని ఒక వైపు దోమలు ఒకవైపు ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోతలు లేవని చెప్పినప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో అమలు కావడం లెదని ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు కరెంటు సమస్యను పరిష్కారం చేయాలని ఇ నరసింహమూర్తి డిమాండ్ చేశారు.