Breaking News

ఏజెన్సీలో గంజాయి రవాణా ఆపటం వలన పేద విద్యార్థి బడికి పోయే.

0 16

 ఏజెన్సీలో గంజాయి రవాణా ఆపటం వలన పేద విద్యార్థి బడికి పోయే..

అల్లూరి సీతారామరాజు జిల్లా: గత కొద్ది కాలం నుండి ఏజెన్సీలో బయటి నుండి వస్తున్న కొంతమంది, ఏజెన్సీలో నివసిస్తున్న ప్రజల ద్వారా గంజాయిని పండించటం,రవాణా చేయడం,దానికోసం ఏజెన్సీలో నివసించే ప్రజల ద్వారా మరియు విద్యార్థుల ద్వారా గంజాయిని సాగు చేయించడం,గంజాయి చిన్నచిన్న ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేయించడం, తక్కువ ధరకు కొని తరలించి బయట ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడం,అధిక లాభం పడటం, ఈ క్రమంలో ఏజెన్సీలోని విద్యార్థులను గంజాయి వర్తకులు వాడుకోవటం వారి జీవితాన్ని నాశనం చేయడానికి కారణం అవ్వటం జరుగుతూ వస్తున్నది. ఎంతోమంది చదువుకోవాల్సిన విద్యార్థులు గంజాయి కేసుల్లోనే చిక్కుకొని జైలుకు వెళ్ళటం జరుగుతుంది. ప్రస్తుతం ఏజెన్సీలో గంజాయి పంటను నిర్మూలించడం వలన ప్రతి ఏజెన్సీలో గ్రామాల్లో విద్యార్థులు నేడు సక్రమంగా స్కూలుకి వెళ్తూ చదువుకోవటానికి కారణమైనది. కాబట్టి ఏజెన్సీలో గంజాయిని పండించడానికి కానీ, తరలించడానికి సహకరించవద్దని కొయ్యూరు సిఐ స్వామి నాయుడు రావణాపల్లి పంచాయితీ,గ్రామం నందు ప్రజా సమితి నిర్వర్తించి అందరికీ గంజాయి అక్రమ రవాణా చేయడం వలన కలిగే నష్టాలు గురించి తెలియజేసి,అలాగే గతంలో ఏజెన్సీలో గంజాయి కోసం విద్యార్థులను సాగు చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి వాడుకున్నట్లు, గంజాయి నిర్మూలించడం వలన ప్రస్తుతం ప్రతి ఏజెన్సీలో విద్యార్థి బడికి పోతున్నట్లు తెలియజేస్తూ వారిని ప్రభావితం చేయడమైనది.

Leave A Reply

Your email address will not be published.