Breaking News

ఆఖరి ఘట్టానికి చేరుకున్న నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు.

0 17

 ఆఖరి ఘట్టానికి చేరుకున్న నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు.


ఉత్కంఠభరితంగా సాగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్లు.

ఫైనల్స్ కు చేరుకున్న మాడెం,పాకలపడు జట్లు

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం,శరభన్నపాలెం గ్రామంలో నేను సైతం చారిటబుల్ పౌండేషన్ వ్యవస్థాపకులు శివ ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ మొత్తంలో మొదటి బహుమతి లక్ష రూపాయలు,రెండవ బహుమతి 50 వేల రూపాయలతో అంగరంగ వైభవంగా విజయవంతముగా నిర్వహించి,నేడు జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లకు యువనేత గొడ్డేటి మహేశ్ బాబు టాస్ వేసి ప్రారంభించారు.


నేటి సెమీ ఫైనల్ మ్యాచ్ మొదటగా మాడెం,నిమ్మగడ్డ మధ్యలో జరిగిన మ్యాచ్ లో మాడెం జట్టు విజయం సాధించింది.మరో మ్యాచ్లో పాకలపాడు,లంబసింగి జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్ లో పాకలపాడు జట్టు విజయం సాధించడంతో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది.

ఈ సందర్భంగా నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు “శివ ప్రసాద్” మాట్లాడుతూ….


త్వరలో ఫైనల్ మ్యాచ్ తేదీని ఖరారు చేసి,అతిరథ మహారథులు,ప్రజా ప్రతినిధులు,క్రికెట్ అభిమానుల మధ్యన,భారీ స్థాయిలో జిల్లా స్థాయి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగనుందని మీడియా ప్రతినిధులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శరభన్నపాలెం సర్పంచ్ సత్య నారాయణ,సోమయ్య మాస్టర్,బోండా హరి,అశోక్,చందు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.