Breaking News

గంజాయి సాగు పై గిరిజనులకు అవగాహన.గంజాయి సాగు,రవాణా చట్టరీత్యా నేరం: మంప ఎస్ఐ లోకేష్ కుమార్.

0 15

 గంజాయి సాగు పై గిరిజనులకు అవగాహన.గంజాయి సాగు,రవాణా చట్టరీత్యా నేరం: మంప ఎస్ఐ లోకేష్ కుమార్.


అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలంలో ఈరోజు బాలరేవుల వెళ్ళే రహదారి మార్గంలో బూధరాళ్ల పంచాయితీకి చెందిన గ్రామాలైన బాలరేవుల,చీడిపల్లి,కొత్తపల్లి,కునుకురు,లోయలపాలెం,నూకరాయి తోట,పిడుగురాయి గ్రామస్తులతో గంజాయి పై అవగాహన కల్పించడం జరిగింది.గంజాయిని పండించడం రవాణా చెయ్యటం చట్ట రీత్యా నేరం అని తెలియపరిచి,డబ్బులకు ఆశ పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు.గంజాయి వల్ల బయట కొన్ని కోట్ల కుటుంబాల జీవితాలు నాశనం అయిపోతున్నాయని,గంజాయిని రవాణా చేసి జైలుకు వెళ్లి జీవితాల్ని నాశనం చేసుకోవద్దని,ఇలాంటి పంటను పండించి జీవితం నాశనం చేసుకునే బదులు వాటి స్థానంలో మన ప్రాంతంలో మెరుగ్గా పండే సాంప్రదాయక పంటలైన రాగులు, కందులు,బీన్స్,కొర్రలు,సామలు వంటి పంటలు పండించి ఆనందకరమైన జీవితాన్ని గడపాలని అన్నారు.మీ అభివృద్ధి కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ముందు ఉంటుంది అని మంప ఎస్ఐ లోకేష్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.