Breaking News

రెండు సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండా వేలకు వేలు జీతాలు తీసుకున్న సరమండ ప్రాధానోపాధ్యాయురాలు పై చర్యలేవి?

0 17

 అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం.

రెండు సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండా వేలకు వేలు జీతాలు తీసుకున్న సరమండ ప్రధానోపాధ్యాయురాలు పై చర్యలేవి?

అధికారులు మనకెందుకులే అనుకుంటున్నారా?

లేక నిర్లక్ష్యమా?

రెండు సంవత్సరాలు ప్రధానోపాధ్యాయురాలు విధులకు హాజరు కాకుంటే ఆమెకు జీతాలు ఎలా పెట్టారు అని గ్రామస్తులు సూటి ప్రశ్న.

అయితే ఈ రెండు సంవత్సరాల కాలంలో సరమండ విద్యార్థులకు మిడ్ డే మీల్స్ భోజనాలు పెట్టారా? పెట్టలేదా?

ఒకవేళ భోజనం పెట్టకపోతే విద్యార్థుల కోసం వండాల్సిన బియ్యం మరియు గుడ్లు ఏమైనట్లు?

రెండు సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయురాలు విధులకు హాజరు కాకుండా తీసుకున్న వేలకు వేలు జీతం,విద్యార్థులకు వండాల్సిన బియ్యం మరియు గుడ్లు, ఇంతటి ప్రజాధనం దుర్వినియోగానికి కారకులెవరు?

కొయ్యూరు మండలంలో చాలా పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందించడంలో విద్యావ్యవస్థ విఫలం?

మీడియాలో వచ్చిన కథనాలకు తెలిసి కూడా కనీసం స్పందించని విద్యాశాఖ అధికారులు.

Leave A Reply

Your email address will not be published.