అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం,వెలగలపాలెం పంచాయతీలోగ్రామ వార్డ్ వాలంటీర్ల సేవలకు సేవా మిత్ర,సేవా రత్న,సేవావజ్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని బహుమతులు అంద చేసిన MPP బడుగు రమేష్,ZPTC వారా నూకరాజు,సర్పంచ్ ఇరువాడ రత్న కుమారి,ఇరువాడ సత్యనారాయణ.
కష్టపడిన ప్రతీ వ్యక్తి కి సేవామిత్ర గుర్తింపు ఇవ్వడంలో వైయస్ జగనన్న ముందు ఉంటారు అన్నారు. కరోనా కాలంలో బాగా పని చేసారన్నారు. దానికి గాను
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రతి ఇంట సంక్షేమాలు అమలు అవడానికి,వాలంటీర్లు వ్యవస్థ,వార్డ్ స్థాయిలో స్థాపించి
దేశ చరిత్రలో ప్రజల వద్దకు పాలన అందించడంలో జగనన్న ప్రభుత్వం ఆదర్శ నియమని కొనియాడారు. సచివాలయం ప్రతి పంచాయతీలో పెట్టి ఇంటి వద్దకు పరిపాలన తీసుకొని వచ్చి గాంధీ కలలు కన్న స్వరాజ్యం స్థాపించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.
మీకు అప్పగించిన బాధ్యత మరింత ముందుకు తీసుకొని వెళ్లాలి అని తెలిపారు.అర్హులు అయిన ఏ ఒక్కరికి పధకం అందలేదు అనే మాట రాకుండా చూడాలని కోరారు.పార్టీ కార్యకర్తలు దగ్గరకు వెళ్లకుండా ప్రతి సంక్షేమం గ్రామ వార్డ్ సచివాలయం ద్వారానే అమలు అవుతున్నాయి అని, ఇలాంటి ప్రజా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం అని అన్నారు. అంతే కాకుండా కొయ్యూరు మారు మూల గ్రామాలు సహితం సర వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణం, 40సవత్సరాలు అని చెప్పుకొనే వారు చరిత్రను మూడు సంవత్సరాలులో తుడిచి పెట్టిన ఘనత వైయస్సార్ ప్రభుత్వం అని అన్నారు.
జిల్లా కేంద్రం,జిల్లా మెడికల్ కాలేజ్, బాక్సైట్,G O రద్దు ఇలాంటి చరిత్ర గుర్తు పెట్టుకొనే విధంగా చిరస్మరణీయ ఘనత అందించిన ఘనత వైయస్సార్ పార్టీది అనితెలియజేసి
అనంతరం వాలంటీర్లకు సన్మానం చేసి,పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇరవాడ రత్న కుమారి, కార్యదర్శి నాయడు,vro,సచివాలయం సిబ్బంది సత్యనారాయణ MPTC బిడిజన అప్పారావు, నీలాపు సూరిబాబు, రాంమూర్తి,గాంధీ,బల్లా ప్రసాద్,వాలంటీర్లు,గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.