Breaking News

కొయ్యూరులో డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బిజెపి నేతలు.

0 15

 

కొయ్యూరులో డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బిజెపి నేతలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలంలో బిజెపి మండల, జిల్లా నాయకులు ఆధ్వర్యంలో దివంగత నేత స్వర్గీయ శ్రీ లోకుల గాంధి గారు అంబేద్కర్ జయంతి రోజున గిరిజన మారుమూల గ్రామాల్లో 1053 కిలోమీటర్ల 73 రోజలు పాదయాత్ర చేసి, పల్లెల్లో సమస్యలు గుర్తించి, జిల్లా కలెక్టర్ గారికి, ఐటిడిఏ పిఓ గారికి వినతుల రూపంలో ఇవ్వడం కారణంగా కొయ్యూరు మండలం బాలరేవుల గ్రామానికి పిఓ, కలెక్టర్ రావడం జరిగింది.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలే కాదు. ఆయన ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలంటే, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడమే కాకుండా… 

ప్రజల సంక్షేమం కోసం నీతిగా నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేసినప్పుడు, ఎవరికి కష్టమొచ్చినా స్పందించే హృదయం ఎక్కడుంటే అక్కడ అంబేద్కర్ ఆశయాలు లక్ష్యాలు నెరవేరినట్టు. కావున ఆ దిశగా మా బిజెపి కుటుంబ సభ్యులు, మండల, జిల్లా నాయకులు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు, బిజెపి గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు, బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మరియు జిల్లా సమాచార హక్కు చట్టం సభ్యులు అర్జున్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కొర్రు నూకరాజు, కొర్ర త్రీనాథ్, ఒబిసి మోర్చా మండల అధ్యక్షులు గాలి దేవుడు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు నెల్లి సత్తిబాబు, మండల ఉపాధ్యక్షులు బొంకు రాము, మండల నాయకులు కూడా కర్రయ్య, సన్యాసిరావు, బోనంగి మోహన్, మోహన్, పాటి దేవుడు అభిమానులు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.