Breaking News

మానవత్వం చాటుకున్న అరకు ఎంపీ మాధవి, శివ ప్రసాద్ దంపతులు.

0 15

 

మానవతా దృక్పథం చాటుకున్న అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి,శివ ప్రసాద్ దంపతులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం,లుబ్బర్తి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్గా సేవలు అందిస్తున్న తూబే అప్పల నరస,(గృహిణి)అనే ఆమె గర్భవతి గా ఇబ్బంది పడుతూ,వారి కుటుంబ సభ్యులు ఆమెను నర్సీపట్నం ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ,అత్యవసర సేవల కొరకు మరల హుటాహుటీన విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ లో చేర్పించిన విషయం అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి దృష్టికి వచ్చింది.వెంటనే ఆమె తన భర్త అయిన నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ ప్రసాద్ కి విషయం తెలిపారు. వెంటనే శివ ప్రసాద్ హాస్పిటల్ కి వెళ్లి దగ్గరుండి చికిత్సలు చేయించి,వేరే వార్డ్ కి మార్చడంతో పాటుగా,వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి,మనోధైర్యం కల్పించారు.

వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కొంత ఆర్థికంగా సహాయం చేశారు.

ఈ విషయం తెలుసుకుని గ్రామవాసులు,సహచర వాలంటీర్లు,అరకు ఎంపీ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


మా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రాంత వాసులకు ఏ అవసరం ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే తమ వంతు సాయం చేస్తామని ఎంపీ దంపతులు మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలకు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.