Breaking News

పెంచిన ఆర్టీసీ చార్జీలు ధరలు తగ్గే వరకు ఈ పోరాటం ఆగదు: టిడిపి

0 18

 

అల్లూరి సీతారామరాజు జిల్లా: RTC చార్జీలు పెంచిన ధరలను తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ జి.సి.సి.చైర్మన్ యం.వి.వి. ప్రసాద్ అన్నారు.

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జి.కే.వీధి మండలం కొత్తగూడెం గ్రామంలో తెలుగు యువత TNSF ఆధ్వర్యంలో RTC ఛార్జీలు,పెట్రోల్,డీజిల్ నిత్యావసర సరుకులు ధరలు పెంచుకుంటూ  పోవడం వల్ల  మధ్యతరగతి,కార్మికులు ,కర్షకులు, ఎంతో నష్టపోతున్నారని, జి.కే.వీధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో ముర్ల.కోటేశ్వరరావు (మాజీ మండల యువత అధ్యక్షులుు), ముక్కలీ.మహేష్, ,మొట్టడం.నూకరాజు ,కొర్ర.బలరాం,మామిడి బాలయ్య పడల్ జి.కే.వీది మండల 16 పంచాయితీల కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.