ఆపరేషన్ పరివర్తన లో భాగంగా గిరిజనులకు అవగాహన కలిగిస్తున్న మంప ఎస్ఐ లోకేష్ కుమార్.
అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలం బూధరాళ్ళ పంచాయితీలోని బాలరేవుల,నూకరాయి తోట గ్రామస్తులతో మంప ఎస్ఐ లోకేష్ కుమార్ గంజాయి పై అవగాహన కల్పించడం జరిగింది.గంజాయి సాగు,రవాణా చెయ్యటం చట్ట రీత్యా నేరమని,అందువల్ల వాటి మత్తులో పడి డబ్బులకు ఆశ పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని వారికి తెలిపారు.గంజాయి వల్ల కుటుంబాలు,జీవితాలు పాడైపోతున్నాయని,గంజాయిని రవాణా చేసి జైలుకు వెళ్లి జీవితాల్ని నాశనం చేసుకోవద్దని,అలాగే నాటు సారా అమ్మడం నేరమని,అలాగే వాటిని త్రాగి ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని. ఈ నాటు సారా త్రాగడం వల్ల ఎక్కువగా ప్రాణాలను కోల్పోతున్నారని,అందువల్ల అందరూ నాటుసారాకు దూరంగా ఉండాలని మంప ఎస్ఐ లోకేష్ కుమార్ తెలియజేయడమైనది.