ఉప ముఖ్యమంత్రి ని శాలువాతో సత్కరించిన వైసిపి మహిళా నాయకురాలు రమణికుమారి.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి వర్యులు,రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి వర్యులు బూడి ముత్యాల నాయుడు ప్రమాణ స్వీకరం చేసి మొదటిసారిగా విశాఖపట్నం విచ్చేసిన మంత్రి ని సర్క్యూట్ హౌస్ లో కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన వైసీపీ మహిళా నాయకురాలు శ్రీమతి పేడాడ రమణికుమారి.అనంతరం విశాఖపట్నం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో పాల్గొన్నారు.