Breaking News

మెనూ సక్రమంగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ.

0 14

 

అల్లూరి సీతారామరాజు జిల్లా,జి.మాడుగుల మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల హాస్టల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని విద్యార్థులు,విద్యార్ధినిలతో కలిసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ.

  విద్యార్థిని,విద్యార్థులకు సక్రమంగా పౌష్టికాహారం అందించని హెచ్ డబ్ల్యు ఒ లు శ్రీనివాస్,మాధవి లను వెంటనే విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

   ప్రభుత్వ జూనియర్ కాలేజి విద్యార్థిని,విద్యార్ధులకు సరైన పౌష్టికాహారం పెట్టకుండా విద్యార్థులకు హెచ్ డబ్ల్యు ఒ లు శ్రీనివాస్,మాధవీ అటలాడుకుంటున్నరనీ ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి,కమిటీ సభ్యులు కె. ప్రభుదాస్,జీవన్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆశ్రమ హాస్టల్ లో  మెనూ సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే ఈ హాస్టల్ లో ఉడికి ఉడకని భోజనం పెడుతున్నరన్నారు.

 అరటి పండు,చికెన్ కూడ మెనూ ప్రకారం పెట్టడం లేదన్నారు.

 ఎంతోమంది నిరుపేద గిరిజన విద్యార్ధులు డబ్బులు కట్టి చదువుకోలేక ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడి కళాశాలలో చదువుకుంటుంటే తమకు సంబంధిత అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇలా మా జీవితాలతో ఆడుకుంటుంటే మేము ఎలా చదువు కుంటామని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్ విద్యార్ధులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విధ్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.