Breaking News

అరకులో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు.

0 14

 అరకులో ఘనంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం నివాసంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.


సివేరి అబ్రహం కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు తినిపించారు.ఈ సందర్భంగా సివేరి అబ్రహం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు వేడుకలు తన నివాసంలో జరగడం చాలా ఆనందంగా ఉందని ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మరియు నవ్యాంధ్రప్రదేశ్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేే మరల ముఖ్యమంత్రిని చేయాలని అందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ కోశాధికారి వంతల నాగేశ్వరరావు,అరకు నియోజకవర్గ నేత రెహమాన్,దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ తనయుడు సివేరి సురేష్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.