Breaking News

పాడేరులో అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి జన్మదిన వేడుకలు.

0 16

 పాడేరులో అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి జన్మదిన వేడుకలు.


ఈరోజు అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పాడేరు మండల కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఎంపీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాడేరు ఎంపీసీ రత్నకుమారి,వైస్ ఎంపీపీ కనకాలమ్మ,మండల మాజీ పార్టీ అధ్యక్షుడు కూడా సింహాచలం, అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా సురేష్,యువజన విభాగం అధ్యక్షుడు విశ్వ, పాడేరు మండలంలోని సర్పంచులు, ఎంపిటిసిలు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.