Breaking News

నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.

0 17

 నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి టోర్నమెంట్ ఘనంగా ముగిసింది.


ఎంతో ఉత్కంఠగా పాకలపాడు వర్సెస్ మాడెం మధ్య కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తొలుత టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ ప్రారంభించిన అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

 ఈ మ్యాచ్లో మాడెం ప్లేయర్స్ మొదటి విజేతలుగా నిలిచారు.

 పాకలపాడు ప్లేయర్స్ రెండోస్థానం నిలిచారు.


మొదటి స్థానంలో నిలిచిన విజేతలకు కప్ మెడల్స్ మరియు లక్ష రూపాయలు క్యాష్ ప్రైస్ అందజేయడం జరిగినది.

రెండో స్థానంలో నిలిచిన వారికి 50 వేల రూపాయలు క్యాష్ ప్రైస్ అందజేయడం జరిగింది.

విజేతలకు బహుమతులను ప్రధానం చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

 నేటి యువత ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలని ఇలాగే అందరూ ఏదో ఒక అవుట్డోర్ గేమ్స్ లో పాల్గొంటూ ఉండాలని కోరారు. ఇంతటి గొప్ప జిల్లాస్థాయి టోర్నమెంట్ నిర్వహించిన నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ ప్రసాద్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

 నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ ప్రసాద్ మాట్లాడుతూ కేవలం యువతను మరింత ఉత్తేజ పరచడం కొరకు వారికి క్రీడల పట్ల శ్రద్ధ కలిగించడం కొరకు మాత్రమే,ఈ మెగా జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడిందని తెలిపారు.

ఇదేవిధంగా జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ 2 తారీఖు మే లో ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అరకు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి గొడ్డేటి మాధవి కి, డాక్టర్ పాల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కాలేజ్ చైర్మన్ వరలక్ష్మి కి, టోర్నమెంట్ విజయవంతంగా ముగించడానికి సహకరించిన పౌండేషన్ సభ్యులకు,గ్రామస్తులకు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు,సబ్ ఇన్స్పెక్టర్ దాసరి నాగేంద్ర,ఎంపీటీసీ లోకుల సోమాగాంధీ,సర్పంచ్ కిముడు సత్యనారాయణ,చింతపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మోరి రవి, గొడ్డేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.