ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేని వారిని పక్కన పెడతాం: సీఎం జగన్
తాడేపల్లి: మంత్రులు,జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ భేటీ ముగిసింది. పలు అంశాలపై వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. మే 2 నుంచి ఇంటింటికి వైసీపీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జూలై 8న వైసిపి ప్లీనరీ ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. మే 10 నుంచి గడపగడపకు వైసీపీ కార్యక్రమం, పాత మంత్రులు,జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు.ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేని వారిని పక్కన పెడతానని సీఎం జగన్ స్పష్టం చేశారు. రీజనల్ కోఆర్డినేటర్ లు జిల్లా అధ్యక్షులను, మంత్రులు కలుపుకు వెళ్లాలని ఎవరికైనా పార్టీనే సుప్రీం అన్నారు. గెలిస్తేనే మంత్రిపదవి అని, గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తామని జగన్ తెలిపారు. ఎవరూ తాము ప్రత్యేకం అనుకోవటానికి వీల్లేదు అని, 175 కి 175 సీట్లు ఎందుకు గెలవమని సీఎం జగన్ ప్రశ్నించారు.