Breaking News

శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొన్న అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గోడ్డేటి మాధవి,శివ ప్రసాద్ దంపతులు

0 16

 శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొన్న అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గోడ్డేటి మాధవి,శివ ప్రసాద్ దంపతులు.


ఎంపీ కి ఘన స్వాగతం పలికిన స్థానిక శాసనసభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి,నర్సింగరావు దంపతులు,ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం,చింతపల్లి మండల కేంద్ర పరిధిలోని ఘనంగా నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గోడ్డేటి మాధవి శివ ప్రసాద్ దంపతులు.


ఈ సందర్భంగా ఎంపీ అమ్మవారిని దర్శించి అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వుండాలని ప్రార్థిస్తూ,ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం సహచర నాయకులతో కలిసి చిన్నారులు నాట్యమాడిన కోలాటం వీక్షించినంతరం,జాయింట్ వీల్, రైలెక్కి సందడి చేశారు.


ఈ కార్యక్రమంలో పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ,చింతపల్లి జెడ్పిటిసి పోతురాజు బాలయ్య,ఎంపీపీ  వంతల బాబురావు,సర్పంచ్ పుష్పలత,మార్కెట్ యార్డ్ చైర్మన్ జల్లి హాలియా రాణి,ఆలయ కమిటీ సభ్యులు,ప్రభుత్వ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.