Breaking News

కాకరపాడు గురుకులంలో ఫేర్ వల్ పార్టీలో కొయ్యూరు ఎంపీపీ.

0 18

 

అల్లూరి సీతారామరాజు జిల్లా: తల్లి,తండ్రులును గౌరవించాలి,ఉపాద్యాయులను గౌరవించాలి,చదువును ప్రేమించాలి..క్రమశిక్షణ,నీతి,నిజాయితీ,విద్యతో కూడిన విద్యార్థులుగా ఉండాలి.కొయ్యూరు మండలం,కాకరపాడు గురుకులంలో జరిగిన ఫేర్వల్ పార్టీ లో MPP బడుగు రమేష్ బాబు విద్యార్థులకు హితబోధ.ఎంపీపీ రమేష్ మాట్లాడుతూ

విద్యార్థులు అందరూ ఇంత స్వేచ్ఛగా,ఆనందంగా,ఉండి చదువుకుంటున్నారు అంటే దానికి కారణం 

మన తల్లిదండ్రులు మన కోసం పడే కష్టం ఉందని గుర్తించాలని,


క్రమశిక్షణతో కూడిన చదువు, సమాజానికి ఉపయోగపడుతుందని, మీరు బాగ చదివి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని,అంతే కాకుండా ఎంత చదువుకున్న సంస్కారం,నిజాయితీ మీతో ఉండాలని,అవి సమాజానికి తోటి మనిషికి దోహద పడతాయని అన్నారు.

 ఒక అప్పుడు ఇక్కడ 8సంవత్సరాలు ఆచార్యులు గా పని చేసాను అని,ఈ రోజు ప్రజా సేవకై నేను MPP గా ఉన్నాను అంటే అది మా తల్లిదండ్రులు కారణం అని ఇలా ఏదొ ఒక రంగంలో మీరు,అభివృద్ధి చెందాలని అన్నారు.


ఈ యొక్క కార్యక్రమంకు నన్ను పిలిచిన ప్రిన్సిపాల్ వరలక్ష్మికి మరియు తొటి సిబ్బందికి ధన్యవాదములు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వరలక్ష్మీ మరియు స్థానిక సర్పంచ్ నత్తూరు సొభన్ దొర,MPTC పిల్లా గంగా భవానీ,బల్లా ప్రసాద్ మరియు సిబ్బంది విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.