Breaking News

ఈ నెల 7న రాజేంద్రపాలెం లో స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు.

0 26

అల్లూరి సీతారామరాజు జిల్లా : కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం లోని అల్లూరి సీతారామరాజు స్మారక మందిరాన్ని పరిశీలించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు.


*  రాజేంద్రపాలెంలో నలుగురు స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు.

* ఈనెల 7వతేదీన ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి.

* అల్లూరి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి.

* సోమవారం అల్లూరి స్మారక మందిరాన్ని పరిశీలించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు

 కొయ్యూరు, మే.2 

  బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఈనెల 7వ తేదీన కొయ్యూరు మండల కేంద్రమైన రాజేంద్రపాలెం లో స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ప్రారంభించనున్నారు.

          రాజేంద్రపాలెం లోని అల్లూరి సీతారామరాజు స్మారక మందిర ప్రాంగణంలో స్వాతంత్ర్య సమరయోధులైన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, అతని అనుచరులైన గాము మల్లుదొర, గంటందొర, పండు పడాల్ విగ్రహాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి రాజన్నదొర ప్రారంభించనున్నారని గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివిఆర్ఎం రాజు, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ క్షేత్ర పరిశీలకుడు ఎన్. సీతారామయ్య తెలిపారు.

 గిరి నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం రాజేంద్రపాలెం లోని అల్లూరి స్మారక మందిరం ప్రాంగణాన్ని క్షుణ్నంగా పరిశీలించారు ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న విగ్రహాలను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులు చర్చించారు.గిరిజన స్వాతంత్ర సమరయోధులకు తగురీతిలో గుర్తింపు ఇవ్వాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.


 ఈనెల 7వ తేదీన అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం లో అల్లూరి ,గంటందొర మల్లుదొర, పండు పడాల్ విగ్రహాలను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు పలువురు పాల్గొంటారని వారు తెలిపారు. సోమవారం రాజేంద్రపాలెం స్మారక మందిరాన్ని పరిశీలించిన వారిలో గిరిజన సంక్షేమ శాఖ డిఈఈ టి .చాణుక్య రావు, ఏఈ సిహెచ్ రామకృష్ణ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.