డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు ప్రత్యేక చొరవతో ఎంపీ నిధులతో ఐదు బోర్లు వేయించిన అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి.
• వేసవికాలంలో ప్రజలకు బాసటగా అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి.
• గిరి గ్రామాల దాహార్తిని తీర్చడమే లక్ష్యం.
• డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు ప్రత్యేక చొరవతో ఎంపీ నిధులతో ఐదు బోర్లు వేయించిన అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి.
అల్లూరి సీతారామరాజు జిల్లా: ఈరోజు కొయ్యూరు మండలం లోని ధర్మవరం,మర్రిపాలెం,గదబపాలెం,కొత్తూరు,గోపవరం గ్రామాలలో అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి,ఎంపీ నిధులతో నాలుగు పంచాయతీలలో 5 బోర్లు వేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ..
ఈ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు బాసటగా నీరు కొరకు ఎటువంటి ఇబ్బందులు, పడకుండా ఉండేందుకు బోర్లు వేయించడం జరిగిందని అన్నారు.
విడతలవారీగా అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న గిరి గ్రామాలకు ఎంపీ నిధులతో బోర్లు మంజూరు చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు,డౌనూరు సర్పంచ్ పొట్టిక భవాని,మూలపేట సర్పంచ్ రావుల వెంకటలక్ష్మి,చిట్టెంపాడు సర్పంచ్ నెమల నూకాలమ్మ,గదబపాలెం సర్పంచ్ ఉల్లి నరసమ్మ, డౌనూరు ఉపసర్పంచ్ రాజుబాబు,కొయ్యూరు మండల బూత్ కన్వీనర్ పొట్టిక పోతురాజు,వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు రామ్మూర్తి,సూరిబాబు,సురేష్ పట్నాయక్,వెంకటరమణ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.