కొయ్యూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, మారుమూల బూదరాళ్ళ గ్రామ పంచాయితీ,బాలరేవుల గ్రామంలో ఇటీవల వంతల లక్ష్మణరావు మల్లీశ్వరి, మాదాల గిరిబాబు కుమారి దంపతులకు జన్మించిన ఇద్దరూ చిన్నారులు అనారోగ్యంతో శని, ఆదివారాల్లో మృతి చెందిన విషయం అందరికి తెలిసిన విషయమే.. అయితే ,,
తేది: 06/05/2022* అనగా శుక్రవారం ఉదయం 11:30 గంటలకు రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రధమ చికిత్స కోసం బాలరేవుల నుండి ఆటో లో వెళ్లగా, ఆ ప్రాంతంలో ఆసుపత్రి లో వైద్యాధికారి మరియు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో, ఆసుపత్రి నుందు కొంత సమయం వేచి, యుండి చేసేదేమీలేక ససేమిరా అంటూ రాజేంద్రపాలెం(కొయ్యూరు) కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ RMP వైద్యుడు దగ్గరకు వెళ్లగా ప్రధమ చికత్స చేసి ఇద్దరు పిల్లలకు కూడా injunctions చేసి, సిరఫ్ లు, మందులు ఇచ్చి అక్కడి నుండి పంపించేసారు.
గ్రామస్తులతో మాట్లాడుతున్న వార్డ్ మెంబర్ సంజీవ్ |
మరుసటి రోజు శనివారం రాత్రి *వంతల లక్ష్మణరావు మల్లీశ్వరి, దంపతుల నెల నర బాబు మరణించాడు. మరుసటి రోజు ఆదివారం రాత్రి మాదాల గిరిబాబు కుమారి దంపతుల 5 నెలల బాబు మరణించడం జరిగింది.రెండు రోజుల్లో ఇద్దరు శిశువులు మృతి పట్ల స్థానిక బూదరాళ్ళ పంచాయితీ సర్పంచి, సాగిన ముత్యాలమ్మ, మరియు వార్డ్ మెంబర్ సంజీవ్ లు మాట్లాడుతూ..
సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ |
ఆరోగ్యం బాగాలేకపోతే చిన్న పిల్లలను ఒక ఎంబిబిఎస్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే, పీడియాట్రిక్స్ దగ్గరకు పంపిస్తారు. గర్భిణీలకు తీసుకువెళ్తే గైనకాలజిస్ట్ దగ్గరకు పంపిస్తారు.
కానీ, ఇక్కడ కొయ్యూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి RMP లు మాత్రం తెలిసి తెలియని ట్రీట్మెంట్ చేసి, సొమ్ము స్వాహా చేసుకొని ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నారు.
ఇద్దరు శిశువులు మరణానికి గల కారణాలు గురించి తగు విచారణ జరిపి, శిశువుల మరణానికి గల కారణమైన వారికి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదే బాలరేవుల గ్రామంలో హెల్త్-సబ్ సెంటర్ ఉంది(శాశ్వత భవనం లేదు). అందులో ఒక MLHP ఒకరు ఉన్నారు ప్రతి రోజూ వారు అందుబాటులో వుండాలి కానీ, డ్యూటీ చేయడం ఉండదు జీతాలు మాత్రం నెల వారి క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. అలాగే మండల కేంద్రంలో ఉన్నటువంటి రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పరిస్థితి ఇంచుమించుగా అదే పరిస్థితి, ఏం చక్కగా సకాలంలో అందుబాటులో ఉండి, గిరిజనులకు సేవచేయడం అదృష్టంగా భావించి గిరిజనులకు సర్వీస్ ఇవ్వాల్సిందిపోయి, ఎక్కడో ఉంటూ.. వారంలో సోమవారం తప్పా, మిగిలిన రోజులలో ఆసుపత్రి కి డుమ్మా కొట్టడం పరిపాటిగా మారిందన్నారు.
దయచేసి భవిష్యత్ లో ఆ కుటుంబాలకు జరిగిన అన్యాయం మరేకుటుంబాలకు జరగకూడదని ఘాటుగా హెచ్చరించారు.