ముసిరి పాడు రోడ్డు నిర్మాణానికి సర్వే చేసిన ఇంజినీరింగ్ అధికారులు.కల నిజం కానుందని హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
ముసిరి పాడు రోడ్డు నిర్మాణానికి సర్వే చేసిన ఇంజినీరింగ్ అధికారులు.
కల నిజం కానుందని హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం:
హుకుంపేట మండలంలోని చీకుమద్దుల పంచాయితీ ,ముసిరి పాడు గ్రామానికి రోడ్డు నిర్మాణానికి గాను గిరిజన సంక్షేమశాఖ (టీడబ్ల్యూ) జేఈ రాముడు,టెక్నీకల్ అసిస్టెంట్ జగన్ లు సర్వేచేశారు.
డొంకిన వలస పర్యటనకు వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు,డొంకిన వలస కోలని నుండి
ముసిరి పాడు గ్రామానికి దగ్గర దారి గుండా రోడ్డు కావాలాని విన్నవించిన నేపథ్యంలో, ఇంజినీరింగ్ అధికారులు సర్వేకు రావడంతో ప్రజల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.రోడ్డు సర్వే కార్యక్రమంలో ముసిరి పాడు వార్డ్ మెంబర్ లు కొండ తాబేలు సురేష్,కొండ తాబేలు నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు కొండ తాబేలు ఆనంద్ రాయుడు,వాలంటీర్ కామేశ్వర రావు,కొండ తాబేలు నారాయణ రావు, చిట్టిబాబు,ఆనంద్,రవి,డొంకిన వలస వాలంటీర్ మలిపరి మురళీకృష్ణ,జన్ని చిన్నారావు,డుంబేరి మత్స్య రాజు యువత పాల్గొన్నారు.