Breaking News

ఈనెల 18 నుండి 21 వరకు శ్రీ శ్రీ శ్రీ చింతాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు.

0 20

 ఈనెల మే 18 నుండి 21 వరకు కొయ్యూరు మండల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ చింతాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు.


అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని రావణాపల్లి పంచాయతీ పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ చింతాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలకు కృష్టాదేవిపేట కొయ్యూరు మోటార్ యూనియన్ మరియు రావణాపల్లి,తోటలూరు గ్రామాల ప్రజలు సహకారంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించటానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

 హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రతి సంవత్సరం మే నెలలో ఈ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించటం ఆనవాయితీ, 

మండలంలోని ధార్మిక సంస్థలు విశ్వ హిందూ పరిషత్,సమరసత సేవా ఫౌండేషన్


వారి సహయ సహకారాలు తీసుకుని ప్రతి రోజూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం చేయటానికి VHP ప్రతినిధులు ఈరే మల్లిబాబు( మండల ధర్మ ప్రచారకులు) కాకూరు వీర్రాజు( మండల ఉపాధ్యక్షులు) సుర్ల సత్తిబాబు( మండల సహా కార్యదర్శి) SSF ప్రతినిధులు

సుర్ల వరలక్ష్మి (మండల మహిళా కన్వీనర్) మాదాల రమణ (ఉపమండల కన్వీనర్) సప్పి శ్రీనివాస్ రావణాపల్లి దుర్గమ్మ తల్లి పూజారి, గ్రామ గ్రామాన తిరిగి అమ్మవారి ఉత్సవాలకు భక్తులు అందరూ తప్పకుండా రావాలని పిలుపునిచ్చారు.

ముఖ్య గమనిక:

అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులు,వ్యాపార సంస్థల ప్రతినిధులు అందరూ మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందచేసి అమ్మవారి కరుణ కటాక్షాలకు పాత్రులు కాగలరని శ్రీ చింతాలమ్మ తల్లి ఉత్సవ కమిటీ వారు కోరారు.

  

Leave A Reply

Your email address will not be published.