Breaking News

చిన్నారుల కుటుంబ సభ్యులకు నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివప్రసాద్ ఆర్థిక సాయం చేయడంతో పాటు బియ్యం అందజేత.

0 23
నేను సైతం వ్యవస్థాపకులు శివప్రసాద్ ఆర్థిక సాయం

 చిన్నారుల కుటుంబ సభ్యులకు నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివప్రసాద్ ఆర్థిక సాయం చేయడంతో పాటు బియ్యం అందజేత.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

బాల రేవులు గ్రామంలో వారం రోజుల క్రితం ఇద్దరు చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే.

ఈరోజు అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి భర్త అయిన పేద ప్రజల ఆప్తుడు,నిస్వార్ధ నిరంతర శ్రామికుడు నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ 

బాల రేవులు గ్రామానికి చేరుకొని స్వర్గస్తులైన చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చడం జరిగింది.

ఈ సందర్భంగా నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివ ప్రసాద్ కి మంచి నీటి సమస్యను గ్రామస్తులు విన్నవించిన వెంటనే ఆ గ్రామానికి నెల రోజుల వ్యవధిలోనే మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ క్రమంలో బాలరేవులు గ్రామస్తులు నిజంగా అదృష్టవంతులుగా భావిస్తున్నామని అన్నారు.

దశాబ్ద కాలంగా కలగా మిగిలిన మంచినీటి సమస్యను ఎంపీ దంపతులు నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో,జగనన్న ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యలు నెరవేరుస్తున్న అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి శివప్రసాద్ దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఎంపీ దంపతులకు జీవితాంతం రుణపడి ఉంటామని గ్రామస్తులు తెలిపారు.

అనంతరం చిన్నారుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేయడంతో పాటుగా బియ్యం అందజేశారు.

ఈ సందర్భంగా వారి సమస్యను అందరికీ తెలిసేలా తెలియజేసిన విలేకర్ల బృందానికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.