Breaking News

సురాజ్య,మానవ హక్కల వేదిక సర్వేపై వైసీపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?-సోమిరెడ్డి

0 19

 

జగన్ రెడ్డి పాలనలో 2112 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 718 మంది మాత్రమేనని తప్పుడు లెక్కలు చెబుతారా

 సురాజ్య,మానవ హక్కల వేదిక సర్వేపై వైసీపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించకపోతే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి?

ఉచిత విద్యుత్ ని 7 గంటలకు పరిమితం చేసింది కాక, రైతుల్ని విద్యుత్ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గం.*  

 మానవహక్కులవేదిక లెక్కలప్రకారం మరణించిన ప్రతి రైతుకుటుంబానికి రూ.7లక్షల పరిహారమివ్వాలి. 

బయటకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబుని, లోకేశ్ ని తిడితే రైతులకు మేలు జరగదని గుర్తుంచుకోండి.

 ఈ ప్రభుత్వంలో ఒక్కధాన్యం రైతులే పెట్టుబడి పెరిగినా మద్ధతు ధర పొందలేక రూ.40వేల కోట్లకు పైగా నష్టపోయారు.

 శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 75 కేజీల ధాన్యం బస్తా అమ్మిన వారిలో ఎంత మందికి రూ.1460 మద్ధతు ధర అందిందో ముఖ్యమంత్రి చెప్పాలి.

గణపవరం సభలో సీఎం చెప్పిన రూ.లక్షా10 వేలకోట్లు ఎక్కడ, ఏ రైతులకు ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలి.

 వ్యవసాయమోటార్లకు మీటర్లు పెడితే ఎవరికీ నష్టం లేదంటున్న వ్యవసాయమంత్రి 30శాతం విద్యుత్ పొదుపు చేయొచ్చంటున్నాడు. అంటే రైతులు విద్యుత్ దొంగలన్నది మంత్రి ఉద్దేశమా?

 మోటార్లకు మీటర్లు పెడితే రైతులపక్షాన ఉద్యమించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.    

 అమరావతిలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న అనేక కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి తలెత్తింది.

అన్నదాత పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటే ముఖ్యమంత్రేమో నిన్న గణపవరం సభలో మాట్లాడుతూ తన మూడేళ్లపాలనలో రైతులకు రూ.లక్షా10వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్పడం సిగ్గుచేటు

ఏ పార్టీలతో సంబంధంలేని సురాజ్యవేదిక, మానవహక్కుల వేదిక సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది.

జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కేవలం రెండున్నరేళ్లలోనే 2,112 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సర్వేలో పేర్కొన్నారు. వారిలో కౌలురైతులే అధికంగాఉన్నారు. 

ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రం మూడేళ్లలో కేవలం 718 మంది మాత్రమే చనిపోయారు.

 ప్రభుత్వమిచ్చిన లెక్కలకంటే రెండున్నరేళ్లలోనే 1390 మంది రైతులు అదనంగా మృత్యువాతపడ్డారు.

అప్పులభారంతో భార్యాపిల్లలను వదిలేసి, నమ్ముకున్న భూమిని వదిలి చనిపోవడం ఎంత బాధాకరమో ప్రభుత్వం ఆలోచించాలి.

వ్యవసాయంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో నిలవడం బాధాకరం

సురాజ్యవేదిక, మానవ హక్కుల వేదిక వారి సమాచారంపై సీఎం ఏం సమాధానం చెబుతారు

రైతుల్ని ముంచింది తెలుగుదేశం కాదని, వైసీపీ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి తెలుసుకుంటే మంచిది.   

తెలంగాణతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్నది శూన్యం. ఈ మూడేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం రైతుభరోసా కింద ఇచ్చింది కేవలం రూ.11,250కోట్లు మాత్రమే. 

50లక్షల రైతు కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ.7,500చొప్పున మూడేళ్లలో ఇచ్చింది రూ.11,250 కోట్లు. 

ఈ ప్రభుత్వంలో మూడేళ్లలో రైతులు చేసిన ధాన్యం (కేంద్రప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకంటే తక్కువగా) అమ్మకాలు పరిశీలిస్తే, ప్రతి రైతు ఎకరాకు సరాసరిన మూడు టన్నులు పండితే, దాన్ని అయినకాడికి తెగనమ్ముకొని రూ.15 వేల వరకు నష్టపోయాడు.

 ఖరీఫ్, రబీలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55లక్షల ఎకరాల్లో ధాన్యం పండిస్తే, ఎకరాకు రూ.15వేల చొప్పున సంవత్సరానికి రూ.8,250కోట్లవరకు రైతులు నష్టపోయారు. 

 మూడేళ్లలో రూ.24,750కోట్లు (దాదాపు రూ.25వేలకోట్లు) రైతులు నష్టపోయారు.

 పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కసీజన్ లోనే కోటి టన్నుల ధాన్యం కొంటున్నారు. రెండో సీజన్ పంట కొనుగోళ్లు వేరే.

 రైతుల నుంచి ధాన్యంకొన్న మూడో రోజునే వారి అకౌంట్లలో నేరుగా డబ్బులేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలోనే ఎందుకింత ఘోరం?

 ఈ ముఖ్యమంత్రి రైతుభరోసా కింద రూ.7,500లు ఇస్తుంటే, కేసీఆర్ రైతుబంధు కింద తెలంగాణలోని ప్రతి ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నారు.

 ఇక్కడ ఉచిత విద్యుత్ రోజులో 7గంటలు ఇస్తుంటే, తెలంగాణలో 24గంటలు ఇస్తున్నారు.

 ఇదంతాపోల్చిచూస్తే, ఈ ముఖ్యమంత్రి రైతులకు చేస్తున్న మంచి కన్నా మోసమే ఎక్కువ.

టీడీపీ ప్రభుత్వంలో 75కేజీల ధాన్యం బస్తా కొనుగోలు జరిగిన వెంటనే వారంలోనే రైతుల ఖాతా ల్లో నేరుగా డబ్బువేశాము. 

 ఈ ప్రభుత్వంలో జరిగినట్లు తేమ పేరుతో, తూనికలు కొలతల పేరుతో రైతుల కష్టాన్ని దోచుకోలేదు. 

75కేజీల బస్తాకు 75కేజీలు లెక్కకట్టాము. కానీ జగన్ ప్రభుత్వంలో 75కేజీల ధాన్యం బస్తా అమ్మాలంటే ప్రభుత్వానికి 15కిలోల ధాన్యం అధికంగా సమర్పించాలి.

టీడీపీ ప్రభుత్వంలో వరిపండించే ప్రతి రైతుకి ఎకరాకు రూ.18వేలు పెట్టుబడి అయితే ఇప్పుడు అది రూ.32వేలు అయ్యింది. రెండురెట్లు పెట్టుబడి ఖర్చు పెరిగింది.

ఈ మూడేళ్లలో ఎకరాకు సరాసరిన రూ.10వేల చొప్పున రూ.16,500 కోట్ల పెట్టుబడి పెరిగింది. 

ఈ ప్రభుత్వంలో ఒక్కధాన్యం రైతే పెట్టుబడి పెరిగి మరియు మద్ధతు ధర పొందలేక ఈ మూడేళ్లలోనే దాదాపు రూ.40వేల కోట్లవరకు నష్టపోయాడు.

 శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 75కేజీల ధాన్యం బస్తా అమ్మిన వారిలో ఎంత మందికి రూ.1460మద్ధతు ధర అందిందో ముఖ్యమంత్రి చెప్పాలి. 

ఎక్కడో 1, 2శాతం వైసీపీ నేతలకు తప్ప ఏరైతుకి ధాన్యంకొనుగోళ్లలో గిట్టుబాటుధర ప్రకారం న్యాయంజరిగిందో, ఎందరు రైతులకు ధాన్యం బకాయిలు సక్రమంగా ఇచ్చారో పాలకులు సమాధానం చెప్పాలి.

ధాన్యం అమ్ముకున్న వారానికి డబ్బులిస్తామన్నారు… 5, 6 నెలలకు కూడా రైతులకు బకాయిలు అందడంలేదు.

 రైతులకు న్యాయంగా అందాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ రూ.3వేలకోట్లు ఎగ్గొట్టారు.

నిన్నటి గణపవరం సభలో మూడేళ్లలో ప్రభుత్వం రైతులకు లక్షా10వేలకోట్లు ఖర్చుపెట్టినట్లు వందల కోట్లతో పత్రికా ప్రకటనలిచ్చారు. దానిలో పంట ఉత్పత్తుల కొనుగోలుకోసం రూ.50వేల కోట్లు ఖర్చుపెట్టినట్టు చెప్పారు. 

ధాన్యం, ఇతర పంట ఉత్పత్తుల్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొనలేదా?

 తక్కువ ధరకు కొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్.సీ.ఐ కి అమ్ము కోలేదా? రూ.50 వేల కోట్లతో కొన్న పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొని ఏట్లో పారేశారా?

 పంట ఉత్పత్తులు కొనుగోళ్లను కూడా రైతులకు చేసిన మేలుకింద ఎలా లెక్కకడతారు? 

 వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత కరెంట్ కి సబ్సిడీ పేరుతో రూ.25వేలకోట్లు లెక్కల్లో చూపిం చారు. 

టీడీపీ హయాంలో 9గంటలు ఉన్న ఉచిత విద్యుత్ ని 7గంటలకు తగ్గించింది కాక, ఉచిత విద్యు త్ ఇవ్వడం తమ ఘనకార్యమే అన్నట్లు పాలకులు చెప్పుకుంటున్నారు. 

మానవహక్కులవేదిక, సురాజ్య వేదిక లెక్కలు తప్పయితే వారిపై కేసులు పెట్టే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? వారేమీ రాజకీయాలకోసం పని చేసేవారు కాదు. నిజాయితీగా రైతులపక్షాన వారికి జరిగిన అన్యాయాన్ని కళ్లముందుంచారు.

మానవహక్కుల వేదిక లెక్కలప్రకారం మరణించిన ప్రతి రైతుకుటుంబానికి రూ.7లక్షల పరిహారమివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

 ప్రాణాలు పోగోట్టుకున్న రైతు కుటుంబాలను మీరు ఆదుకోరు..ఇంకెవరైనా ఇస్తే వారిపై పడి ఏడుస్తారు. మీరు చేయరు…ఇంకొకరు చేస్తే ఓర్చు కోలేరు.  

బయటకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబుని, లోకేశ్ ని తిడితేనో, రైతులకి అది చేస్తున్నాము. .ఇది చేస్తున్నాము… అంత ఇస్తున్నాము. అని తప్పుడు లెక్కులు చెబితేనో రైతులకు మేలు జరగదని ముఖ్యమంత్రి గుర్తుంచుకుంటే మంచిది.  

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎవరికీ నష్టంలేదంటున్న వ్యవసాయ మంత్రి, అసలు మీటర్లు పెట్టకపోతే వచ్చే నష్టమేంటో చెప్పాలి.

 పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ గానీ, తమిళనాడు సీఎం స్టాలిన్ గానీ, కేరళ ముఖ్యమంత్రిగానీ మోటార్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మీటర్లు బిగిస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిసే వారంతా వద్దన్నారా?

 వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే 30శాతం విద్యుత్ ఎలా ఆదా అవుతుందో.. అంతగొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఏమిటో ముఖ్యమంత్రి సెలవివ్వాలి.

 30శాతం విద్యుత్ రైతులు దొంగిలిస్తున్నారని ఈ ప్రభుత్వం చెబుతోందా?

 ఈ ముఖ్యమంత్రి రైతుల్ని దొంగలుగా చూస్తున్నాడా? కేంద్రం నిబంధనలకు తలొగ్గి, అప్పులకోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధమయ్యారు. 

రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేని నిర్ణయాలను ఎదుర్కొనే దమ్ము లేనప్పుడు, కేంద్ర పెద్దలు చెప్పిందానికల్లా తలాడించడం తప్ప ఏంచేయగలరు? 

మోటార్లకు మీటర్లు పెడితే రైతులపక్షాన ఉద్యమించడానికి మేం సిద్ధంగా ఉన్నాము.  

 ఈప్రభుత్వం గతంలో 9గంటలు ఇచ్చే ఉచిత విద్యుత్ ని, చచ్చీచెడి 7గంటలకే పరిమితం చేసింది. 

ఎక్కడా రైతులకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలేదు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ 7గంటలకే పరిమితంచేసినప్పుడు వారు అదనంగా విద్యుత్ వాడుకునే అవకాశం ఎక్కడుంది?

 ఈ ప్రభుత్వం వచ్చాక ఆక్వారైతులకు విద్యుత్ ఛార్జీలుపెంచింది. ఉద్యానపంటల రైతులపై భారంవేసింది. ఏప్రియల్ నుంచి విద్యుత్ ఛార్జీలుఎందుకు పెంచారోచెప్పండి.

 రైతులు వినియోగించే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే, వారిసొమ్ముతో వారే కొత్తది తెచ్చుకోవాలంటున్నారు. 

ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర విద్యుత్ రంగమే నాశనమైంది.

 రూ.21వేల కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏం చేశారో చూశాం కదా! 

ఈ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ, ఆ తప్పులకు రైతుల్ని బలిచేస్తోంది అన్నారు.

Leave A Reply

Your email address will not be published.