ఆధార్,ఆరోగ్య శ్రీ అన్ని ప్రభుత్వ నమోదు పత్రాలను ముందే సరిచేసుకోండి- బీజేపీ అరకు జిల్లా కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి దుక్కేరి.ప్రభాకరరావు.
ఆధార్,ఆరోగ్య శ్రీ అన్ని ప్రభుత్వ నమోదు పత్రాలను ముందే సరిచేసుకోండి- బీజేపీ అరకు జిల్లా కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి దుక్కేరి.ప్రభాకరరావు.
గిరిజన సోదరి సోదరామానులరా,,, మీ ఆధార్ మరియు ఆరోగ్య శ్రీ అన్ని ప్రభుత్వ నమోదు పత్రాలను ముందే సరిచేసుకోవాలని బీజేపీ అరకు జిల్లా కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి దుక్కేరి.ప్రభాకరరావు గిరిజనులను కోరారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నందు వైద్యం పొందుతున్న బాలింత బురిడీ జయ పెద్దహరిపురం గ్రామం,దుప్పులవాడ పంచాయితీ,GK వీధి మండలానికి చెందిన బురిడీ జయకు ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ లో బురిడీ జయ అని ఉండగా, ఆరోగ్య శ్రీ కార్డు నందు మాత్రం బురిడీ జామున అని ఉండటంతో ఆరోగ్య శ్రీ వర్తించాలంటే పేర్లు ఆధార్ కార్డు మరియు ఆరోగ్య శ్రీ కార్డు లో వేరే వేరేగా ఉందని, మీరు దీనిని సరిచేసుకోవాలని, లేకుంటే ప్రస్తుతం ఆపరేషన్ అయి బిడ్డను జన్మనిచ్చిన తల్లికి ప్రభుత్వం నుండి వచ్చే లబ్ది కష్టంగా మారిందని,ఆరోగ్య శ్రీ నుండి తెలపగ ఈ విషయాన్ని బీజేపీ అరకు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దుక్కేరి.ప్రభాకరరావు దృష్టికి తీసుకు రాగ వెంటనే చింతపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కి చేరుకొని,ఆరోగ్య శ్రీ గురించి ఉన్నతధికారులతో మాట్లాడి జరిగిన తప్పిదాన్ని ఒక లెటర్ రూపంలో సమర్పించగా తప్పకుండా అవుతుంది అని, ఆరోగ్య శ్రీ ఉన్నతాధికారులు బురిడీ జయకు ప్రభుత్వ లబ్ది చేకూరుస్తామని తెలియపరిచారని ప్రభాకర్ రావు తెలిపారు.ఇటువంటి సమస్యలతో నిరక్షరాసులైన గిరిజనులు అనేకమంది ముందుగా తప్పిదములు గుర్తించకపోవటం వలన ప్రభుత్వం నుండి వచ్చే అత్యవసర లబ్ది పొందలేకున్నారని, కనుక ప్రభుత్వం నుండి మరియు ప్రైయివేట్ సంస్థలలో ఆధార్ మరియు ఆరోగ్య శ్రీ ఇలా ప్రతి ప్రభుత్వ నమోదు పత్రాలు నిశితంగా పరిశీలించి ఇవ్వాలని ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూడాలని అధికారులకు తెలియపరుస్తున్నారు.