Breaking News

కొయ్యూరు ఎమ్మార్వో పై స్వందనలో ఫిర్యాదు.

0 21

 కొయ్యూరు ఎమ్మార్వో పై స్వందనలో ఫిర్యాదు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు:

అక్రమ కట్టడాలు నిలుపుదల చేయాలని ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఎమ్మార్వో పై ఆదివాసి జేఏసి కొయ్యూరు మండల కో కన్వీనర్ వాణి ప్రకాష్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.మండలంలో ఉన్నటువంటి గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై స్థానిక ఎమ్మార్వో తిరుమలరావు కి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని అందుకే స్పందన లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


దీని కారణంగా ఎమ్మార్వో పై స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.ఈనెల 20 వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ కి ఎమ్మార్వో ని,ఫిర్యాదుదారుడు హియరింగ్ కి రావాలని కలెక్టర్ ఆఫీస్ నుంచి సమాచారం అందింది. అందుబాటులో ఉన్న జేఏసీ సభ్యులు,గిరిజనులు 20వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ కి ఎవరికి వారే స్వచ్ఛందంగా పాడేరు రావలసిందిగా వాణి ప్రకాష్ మరియు జేఏసీ సభ్యులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.