Breaking News

అల్లూరి యువ గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు.

0 24

 అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని డౌనూరు GTWA BOYS స్కూల్ నందు ఈనెల 27వ తేదీన, ఉదయం 8 గంటల నుండి అల్లూరి యువ గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు అల్లూరి యువ గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు టి.మల్లేష్ తెలిపారు.

గిరిజన ప్రాంతంలో చాలా మంది గిరిజనులు పోషకాహారలోపంతో ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులు సికిల్సెల్ ఎనీమియా వంటి రక్తహీనత వ్యాధులకు గురై చాలా ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని,కనుక ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేసినట్లయితే అలాంటి వారి ప్రాణాలు కాపాడవచ్చు అని అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు మల్లేష్ తెలిపారు.

18 సంవత్సరాలు నిండి ఉండి 60 సంవత్సరాల లోపు వారు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని మల్లేష్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.