Breaking News

చింతాలమ్మ ఘాట్ రోడ్డులో లారీ బోల్తా.

0 19

 అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం:

 చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో శుక్రవారం రాత్రి జీడికర్రల లారీ బ్రేక్‌లు ఫెయిల్‌ కావడంతో మూడవ మలుపు వద్ద బోల్తా పడింది.


జీడిమామిడి కర్రల లోడుతో వెళుతున్న లారీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. 

బోల్తా పడిన లారీ నుండి డ్రైవర్ దుర్గా ప్రసాద్ బయటపడ్డాడు. డ్రైవర్ ఒక్కడు మాత్రమే ఉండడంతో,ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఎం.మాకవరం పంచాయితీ నడింపాలెం లో సుంకర పండు అనే వ్యక్తి యొక్క జీడి మామిడి కర్రల లోడుతో నర్సీపట్నం వైపు తీసుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

లారీ నర్సీపట్నానికి చెందినదని సుంకర పండు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.