Breaking News

అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల పై మరోసారి పంజా విసిరిన విశాఖ సెబ్ అధికారులు.

0 31

 అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల పై మరోసారి పంజా విసిరిన విశాఖ సెబ్ అధికారులు.

నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు విశాఖ సెబ్ అడిషనల్ ఎస్పీ బి శ్రీనివాసరావుగారి అధ్వర్యంలో గంజాయిపై విస్తృత దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో నగర శివార్లలో పెందుర్తి స్టేషన్ పరిధిలోని సరిపల్లి జంక్షన్ వద్ద మరోసారి సెబ్ పోలీసులు గంజాయి ముద్దాయిల ఆటకట్టించారు. తెల్లవారుజామున సెబ్ ఎఈఎస్ శ్రీనాధుడు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించి స్కోడా కారు యాభైమూడు కేజీల గంజాయి పట్టుకోవడంతో పాటు ముగ్గురు ముద్దాయిలను అరెస్టు సెబ్ పోలీసులు అరెస్టు చేసారు. అధికారుల కధనం ప్రకారం ఢిల్లీకి చెందిన రితిక్ కుమార్, జ్యోతి , పటియాలాకు చెందిన అభయ్ కుమార్, ఘజియాబాద్ కు చెందిన విపిన్ ముఠాగా ఏర్పడ్డారు. ఢిల్లీనుంచి కారులో బయలుదేరి వచ్చి అరకు ప్రాంతంలోని పీటర్ తో సంబధాలు ఏర్పరుచుకుని గంజాయి సేకరించి దర్జాగా రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకు చేరవేసేందుకు పధకం రచించారు. పక్కా సమాచారం అందుకున్న విశాఖ సెబ్ పోలీసులు తెల్లవారు జామున వారి గుట్టు రట్టు చేసారు. ఢిల్లీకు చెందిన రితిక్ కుమార్, అరకు కు చెందిన పీటర్ తో ఆర్ధిక వ్యవహారాలు జరిపి గంజాయి కొనుగోలు వ్యవహారం చూసేవారు. అభయ్ కుమార్, జ్యోతి పర్యాటకుల మాదిరి అరకు కు కారులో వచ్చి వెళ్లేటప్పుడు గంజాయిని కారు లో నింపుకుని రితిక్ కుమార్ కు ఢిల్లీలో అందించేవారు. వాటి అమ్మకాల ను రితిక్ కుమార్ చూసుకునేవారు. కారు నడిపే బాధ్యతను విపిన్ చూసుకునేవాడు. వచ్చిన నగదును నలుగురూ తీసుకునేవారు. గత సంవత్సరం జూన్ లో ఇదే విధంగా వచ్చి గంజాయిని తీసుకువెళ్లినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ కేసులు ఇంకా విచారణ జరగాల్సి ఉందని సెబ్ అడిషనల్ ఎస్పీ బి శ్రీనివాసరావు తెలిపారు. అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. దాడుల్లో పాల్గొన్నడీటీఎఫ్ విశాఖపట్నం, సెబ్ పెందుర్తి స్టేషన్, పోలీస్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని నగర్ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్  అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.