Breaking News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి ప్రజల పై పడుతున్న భారాన్ని తగ్గించాలి: బిజెపి

0 51

 అల్లూరి సీతా రామరాజు జిల్లా పాడేరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి ప్రజల పై పడుతున్న భారాన్ని తగ్గించాలి: బిజెపి


బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస ఉమా మహేశ్వర రావు మరియు

బీజేపీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు డిమాండ్. 

ఈ రోజు పాడేరు లోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో బీజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ పై ఏడాదికి లక్ష కోట్ల రూపాయల భారం పడుతునప్పటికి, దేశ ప్రజల కోసం ఆలోచించి పెట్రోల్ పై 8 రూపాయలు, డీజిల్ పై 6 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 

 దీంతో పెట్టోల్ 9.50 రూపాయలు, డీజిల్ 7 రూపాయలు తగ్గింది. 

కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకు ప్రజా సమస్యలు ఏవి పట్టనట్లు దున్న పోతు పై వాన పడ్డట్లు వ్యవహరిస్తుంది. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంధనం ధరను తగ్గించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గించేందుకు సమస్య ఏంటి ?

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ పంతాని వీడి ఇంధనం పై వ్యాట్ తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు, అనంతరం జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన యొక్క 9 కోట్ల మంది లబ్ది దారులకు గ్యాస్ సిలిండర్ కు ₹ 200 సబ్సిడీని (12 సిలిండర్ల వరకు ) మహిళా మూర్తులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ సంవత్సరం అందిస్తుంది, మరి మీ సంగతి ఏంటి జగన్ మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నించారు, తక్షణమే పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు,ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి సల్ల రామకృష్ణ, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు, గిరిజన మోర్చా ఉత్తరాంద్ర జోనల్ ఇంచార్జి కురుస రాజారావు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు లకే భాస్కర్, యువమోర్చ జిల్లా ఇంచార్జి పెనుమాక రవికుమార్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పాంగి మత్స్య కొండ బాబు, జిల్లా ట్రేడ్స్ కన్వీనర్ వాడపల్లి అబ్బులు,హుకుంపేట బీజేపీ మండల అధ్యక్షులు వంతల గాసన్న,వై ఎస్ బోస్,తదితరులు పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.