అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం : చీడిపాలెం గ్రామ శివారులలో 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్సై దాసరి నాగేంద్ర తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు, తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా, కారు, రెండు బైక్ లపై తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని తెలిపారు. ఈమేరకు గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని, జీ.మాడుగుల మండలానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరో ఇద్దరు పరారయ్యారని తెలిపారు.
Related Posts